ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ ప్రమాదం నుంచి కోలుకుంటున్నాడు.సింగపూర్ స్కూల్లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన మార్క్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ ప్రమాదంలో అతడి చేతులు, కాళ్లు గాయపడ్డాయి. పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడం వల్ల శ్వాస సమస్యలు ఎదురయ్యాయి.ప్రమాదం సమాచారం అందుకున్న వెంటనే పవన్ కల్యాణ్ సింగపూర్‌కు బయలుదేరి వెళ్లారు.తర్వాత మెగాస్టార్ చిరంజీవి కుటుంబసభ్యులు కూడా మార్క్ శంకర్ ను పరామర్శించేందుకు వెళ్లారు.తాజాగా మార్క్ ఆసుపత్రి బెడ్‌పై ‘విజయం’ సంకేతంగా చేతిని పైకెత్తిన ఫోటోను కుటుంబం విడుదల చేసింది.ఈ ఫోటో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.మార్క్ ప్రస్తుతం మెరుగైన స్థితిలో ఉన్నాడు అని వైద్యులు తెలిపారు.పూర్తిగా కోలుకోవడానికి ఇంకా మూడు రోజులు పట్టనుందని సమాచారం.ప్రమాదం తర్వాత అభిమానులు, ప్రజలు మార్క్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
అగ్నిప్రమాదం నుండి కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్
By admin1 Min Read