కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ లతో కూడిన భారత బృందం భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలను భారతదేశం నుండి వియత్నాం దేశంలోని హో చి మిన్ నగరానికి తీసుకువెళ్లారు. ఒక చారిత్రక, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన భగవాన్ బుద్ధుని పవిత్ర అవశేషాలను భారతదేశం నుండి వియత్నాం దేశంలోని హో చి మిన్ నగరానికి తీసుకురావడం చాలా ఆనందంగా ఉందని మంత్రి దుర్గేష్ తెలిపారు. ఇలాంటి మహత్తరమైన కార్యక్రమంలో తనను భాగస్వామిగా అవకాశం కల్పించిన భారత ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుండి 6వ తేదీ వరకూ వియత్నాంలో జరగబోయే బుద్ధ భగవానుని అవశేషాల ప్రదర్శనలో భాగంగా న్యూఢిల్లీ నుంచి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు, ఏపీ మంత్రి దుర్గేష్ లు కలిసి పవిత్ర అవశేషాలను పేటికలో భద్రపరిచి ప్రత్యేక హెర్క్యులస్ ఎయిర్ క్రాఫ్ట్ లో ఆ పవిత్ర అవశేషాలను తీసుకుని వియత్నాం బయలుదేరి వెళ్లారు. వియత్నాంలో జరగబోయే బుద్ధుడి అవశేషాల ప్రదర్శన కార్యక్రమ బాధ్యతలను కేంద్రమంత్రి కిరణ్ రిజిజు మరియు రాష్ట్రమంత్రి కందుల దుర్గేష్ లకు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. మే 6వ తేదీన హో చి మిన్హ్ లో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన జరగనుంది.
వియత్నాంలో భారత మంత్రులు…మే 6న హో చి మిన్హ్ లో బుద్ధుడి అవశేషాల ప్రదర్శన
By admin1 Min Read

