దేశ సరిహద్దుల్లో దేశ భద్రత కోసం తన ప్రాణాలర్పించిన ఏపీకి చెందిన సైనికుడు మురళీ నాయక్ కు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు వెళ్లి మురళీ నాయక్ భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. మురళీ నాయక్ తల్లితండ్రులను ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ. 50లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఆయన స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 5ఎకరాలతో పాటు 300 గజాల ఇంటిస్థలం ఇవ్వనున్నట్లు తెలిపారు. కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వనున్నారు. వీర మరణం పొందిన సైనికుడికి వ్యక్తిగతంగా పవన్ రూ.25లక్షల వ్యక్తిగత సాయం చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఆయన కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని ఆకాంక్షించారు.
జవాన్ మురళీ నాయక్ కు నివాళులర్పించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్… కుటుంబానికి రూ.50లక్షల ఆర్థిక సాయం
By admin1 Min Read
Previous Articleఆర్చరీ వరల్డ్ కప్ లో భారత్ కు మరో స్వర్ణం
Next Article యోధుడికి అశ్రు నివాళులు అర్పించిన మంత్రులు