ఎలాంటి అక్రమాలకు ఆస్కారం లేకుండా అర్హులకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద లబ్ధి చేకూర్చే విధంగా చర్యలు చేపట్టినట్లు కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పథకం కింద చేపట్టే నిర్మాణాలపై గుంటూరులోని ఆర్అండ్ బీ కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అక్రమాలకు తావు లేకుండా అర్హులకు ‘ఆవాస్’ ఆండ్రాయిడ్ అప్లికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా రెండు కోట్ల నూతన గృహాల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. అసంపూర్తిగా ఉన్న గృహాల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పెమ్మసాని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి, రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్, హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్, జిల్లా కలెక్టర్, గృహనిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.
అక్రమాలకు తావులేకుండా అర్హులకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద లబ్ధి: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్
By Indu1 Min Read