భగవాన్ శ్రీ సత్యసాయిబాబాగారి జయంతి సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు ‘ఎక్స్’ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఆధ్యాత్మిక బోధనలతో ప్రజలకు ఉత్తమ మార్గనిర్దేశం చేయడమే కాకుండా, అనితర సాధ్యమైన ఎన్నో సామాజిక సేవాకార్యక్రమాలను నిర్వహించిన మానవతామూర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబాగారి జయంతి సందర్భంగా ఆ మహిమాన్వితుని చరిత్రను, సందేశాలను స్మరించుకుందామని పిలుపునిచ్చారు.
ఘనంగా భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకలు
ఆంధ్రప్రదేశ్ లోని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 99వ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. ప్రశాంతి నిలయంలోని కుష్వంత్ హాల్ లో సత్యసాయిబాబా వారి మహా సమాధిని గవర్నర్ దర్శించుకున్నారు. గవర్నర్ తో పాటు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్, చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్ సవిత కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగులకు గవర్నర్ కృత్రిమ పాదాలు అందించారు.