‘ఫెంజల్’ తుఫాను తీరాన్ని తాకింది. పుదుచ్చేరి దగ్గరలో ఇది తీరం దాటుతోంది. తుఫాను తీరాన్ని దాటే ప్రక్రియ దాదాపు 4 గంటలు పడుతుందని ఐఎండీ అంచనా వేసింది. గత 6 గంటలుగా గంటకు 7 కిమీ వేగంతో ఇది కదిలిందని రాత్రి 11:30 సమయానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ గాలులు, ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Previous Articleఆ సమయాలలో ఆలయానికి రావొద్దు..!
Next Article ప్రతిదాడి మమ్మల్ని మరింత బలపరుస్తుంది:- గౌతమ్ అదానీ