డిసెంబర్ 17 నుండి 20 వరకు విశాఖపట్నం వేదికగా భారత్ మరియు శ్రీలంకలకు చెందిన నావికా దళాలు సంయుక్తంగా స్లినెక్స్ 2024 పేరిట నావికా విన్యాసాలు జరుగుతున్నాయి. హార్బర్ ఫేజ్, సీ ఫేజ్ అనే రెండు దశల్లో ఈ విన్యాసాలు జరుగుతాయి.
ఇరుదేశాల మధ్య నావికాదళ సంబంధాలను బలోపేతం చేసుకోవడంతో పాటు హిందూ మహాసముద్ర ప్రాంతంలోని సముద్ర భద్రత, రక్షణ పట్ల సహకరించుకోవడం, ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టం చేయడం ఈ విన్యాసాల ప్రధాన లక్ష్యం. భారతదేశం యొక్క నైబర్ హుడ్ ఫస్ట్ పాలసీ మరియు హిందూమహాసముద్ర ప్రాంతంలో సముద్రతీర భద్రత విషయంలో సహకరించుకునేందుకు 2015లో భారతప్రభుత్వం ప్రారంభించిన సాగర్ (సెక్యూరిటీ ఫర్ ఆల్ ఇన్ ద రీజియన్) లక్ష్యానికి అనుగుణంగా ఈ విన్యాసాలు జరుగుతున్నాయి.
Previous Articleపోర్న్ స్టార్ కేసు…ట్రంప్ కు భారీ షాక్
Next Article ఆ వీడియోలు నమ్మవద్దు : ఎస్‌బీఐ అలర్ట్