ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీ సిటీలో 75 ఎకరాల్లో జపాన్ కు చెందిన ప్రముఖ ఏసీ, రిఫ్రిజిరేటర్ల తయారీ కంపెనీ డైకిన్ రూ.వెయ్యి కోట్లతో తయారీ యూనిట్ ను ఏర్పాటు చేయనుంది. తైవాన్ కు చెందిన రెచి ప్రెసిషన్ భాగస్వామ్యంతో ఈ పెట్టుబడులు పెట్టనుంది. ఇందులో మెజారిటీ వాటాదారుగా డైకిన్ ఉండనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే పెట్టుబడుల ప్రస్తావన కార్యరూపం దాల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీ సిటీలో పెట్టే యూనిట్ తో కలిపి దేశంలో మూడు యూనిట్లు ఏర్పాటు చేసినట్లు అవుతుంది.
దేశంలో ప్రస్తుతం 2 మిలియన్ యూనిట్లను తయారు చేస్తున్నాం. 2030 నాటికి ఉత్పత్తి సామర్థ్యాన్ని 5 మిలియన్ యూనిట్లకు చేర్చాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. దేశీయ మార్కెట్లో ఏసీ అమ్మకాలలో సింహభాగం దక్కించుకోవాలన్నదే మా ఆలోచన. ఈ ఒప్పందంతో దేశీయంగా మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరకే ఏసీలను అందించడం సాధ్యం అవుతుందని సంస్థ ప్రకటనలో తెలిపింది.
Previous Articleక్యాన్సర్ కు వ్యాక్సిన్ కనుగొన్న రష్యా..!
Next Article ప్రధాని మోడీతో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ భేటీ