ఏపీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కుప్పం నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆమె నేడు స్థానిక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐటీ రంగంలోనూ మహిళలు రాణించడం సంతోషకరమన్నారు. విజన్ తో ముందుకెళితే అద్భుతాలు సృష్టించవచ్చని పేర్కొన్నారు. నిత్యం ప్రజల గురించి ఆలోచించే సీఎం చంద్రబాబే తనకు స్ఫూర్తి అన్నారు. తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్ బాగుండాలని ఎంతో కష్టపడి చదివిస్తారని వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఒకప్పుడు మహిళలు ఇంటికే పరిమితమయ్యేవాళ్లని ఆ తర్వాత పరిస్థితులు మారాయని ఇప్పుడు అన్ని రంగాల్లోనూ మహిళలు ముందున్నారన్నారు. మహిళలు స్వతంత్రంగా బ్రతకాలని, ఆర్ధికంగా ఎదగాలని చంద్రబాబు డ్వాక్రా సంఘాలు పెట్టారని చెప్పారు. డ్రగ్స్, గంజాయి జోలికి యువత పోవొద్దని బంగారు భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. మహిళలు పట్టుదల,ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలని అన్నారు.వ్యక్తిగత పట్టుదలతో, క్రమశిక్షణతో శ్రమించి జీవితంలో లక్ష్యాలను చేరుకోవాలని ఆత్మస్థైర్యంతో సమస్యలను అధిగమించాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.
మహిళలు పట్టుదల,ధైర్యం, ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్ళాలి: నారా భువనేశ్వరి
By admin1 Min Read
Previous Articleఅమిత్ షా వ్యాఖ్యలపై స్పందించిన విజయ్…!
Next Article 80వేల దిగువకు సెన్సెక్స్..24 వేల దిగువకు నిఫ్టీ