ఉత్తరాంధ్రలో రెండ్రోజులుగా బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడన ప్రభావంతో భారీ వర్షాలు పడుతున్నాయి. అల్పపీడనం తాజాగా వాయుగుండంగా బలపడినట్టు వాతావరణశాఖ తెలిపింది. నిన్న సాయంత్రానికి చెన్నైకి 370 కిలోమీటర్ల దూరంలో, విశాఖకు 450 కిలోమీటర్ల దూరంలో, ఒడిశాలోని గోపాలపూర్ కు 640 కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమై ఉన్నట్టు అధికారులు వివరించారు. ఇక భారీగా కురుస్తున్న వర్షాల వలన అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లోని వేలాది హెక్టార్లలో పంటలు ధ్వంసమయ్యాయి.
వర్షాలు నేడు కొంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని, విశాఖపట్నం, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం మన్యం,శ్రీకాకుళం విజయనగరం, జిల్లాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Previous Articleఏపీలో మద్యం ప్రియులకు జోష్ ఇచ్చే న్యూస్
Next Article ఆర్టీసీ అభివృద్ధికి కృషి:మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి