దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాలనలో 1975 జూన్ 25 నుండి 1977 వరకు కొనసాగిన ఇండియన్ ఎమర్జెన్సీ ఆధారంగా తెరకెక్కిన పొలిటికల్ డ్రామా చిత్రం “ఎమర్జెన్సీ”.ఇందులో కంగనారనౌత్ ఇందిరాగాంధీ పాత్రలో నటిస్తోంది.ఇప్పటికే విడుదల చేసిన ఎమర్జెన్సీ ట్రైలర్‌కు మంచి స్పందన రావడమే కాదు.ఇందిరాగాంధీ పాత్రలో కంగనాకు సినీ అభిమానుల నుండి మంచి మార్కులు పడ్డాయి.ఈ మేరకు కంగనా రనౌత్ ఈ చిత్రం ప్రమోషన్స్ కోసం చాలా రోజుల తర్వాత మళ్లీ ట్రెండీ అవతార్‌లో ప్రత్యక్షమైంది.
ఎమర్జెన్సీ ప్రమోషన్స్‌లో వైట్ అండ్ వైట్ డ్రెస్‌లో మెరిసిపోయింది.బాలీవుడ్ దర్శకనిర్మాత,నటుడు అనుపమ్ ఖేర్‌తో కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొంది.ఈ చిత్రంలో ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా నిలబడ్డ ప్రముఖ రాజకీయ వేత్త జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) పాత్రలో పాపులర్ బాలీవుడ్ దర్శక-నిర్మాత అనుపమ్ ఖేర్ నటిస్తుండగా..శ్రేయాస్ తల్పడే,భూమికా చావ్లా ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రాన్ని కంగనా హోం బ్యానర్ మణి కర్ణిక ఫిలిమ్స్ బ్యానర్ పై రేణు పిట్టి,కంగనారనౌత్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.ఈ నెల 17న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.