విజయవాడ లబ్బీపేట ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటుచేసిన పాలిటెక్ ఫెస్ట్ కు ముఖ్యఅతిధిగా మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు అధునాతన ఆవిష్కరణల గురించి ఈసందర్భంగా అడిగి తెలుసుకున్నారు. జీవన ప్రయాణంలో అనేక ఇబ్బందులు వస్తాయి, ఎదురుదెబ్బలు తగలొచ్చు. కిందపడ్డాక ఎంత త్వరగా లేస్తామనేది ముఖ్యమని విద్యార్థులలో స్పూర్తి నింపారు. అనుకున్నది సాధించేవరకు పట్టువదలొద్దని విద్యార్థులకు పేర్కొన్నారు. ఐటిఐ, పాలిటెక్నిక్ లు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తయారుచేసి, మార్కెట్ లింకేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ ఆవిష్కరణలు చేసిన వారికి అవార్డులు అందించారు. సీఎం చంద్రబాబు డేర్ టు డ్రీమ్.. స్ట్రైవ్ టు ఎచీవ్ అని చెబుతుంటారు. ఆయన మాటలను స్పూర్తిగా తీసుకొని యువత ముందుకు సాగాలని లోకేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దేరామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
అనుకున్నది సాధించేవరకు పట్టువదలొద్దు:పాలిటెక్ ఫెస్ట్ లో పాల్గొన్న మంత్రి నారా లోకేష్
By admin1 Min Read
Previous Article“ఎమర్జెన్సీ” చిత్రం ప్రమోషన్ లో పాల్గొన్న కంగనా రనౌత్..!
Next Article మలేషియా ఓపెన్ టోర్నీలో గాయత్రీ-ట్రీసా జోడీ శుభారంభం