ఈ రోజు మన రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయే రోజని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రధాని చేతులు మీదుగా రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్ట్ లకు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసారు. విశాఖ ప్రజల చిరకాల కోరిక, విశాఖ రైల్వే జోన్ పనులు ప్రారంభం అయ్యాయని వివరించారు. విశాఖపట్నం వేదికగా ఏపీ వ్యాప్తంగా జరుగనున్న అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఏపీలో 93శాతం స్ట్రెక్ రేట్, 57 శాతం ఓట్లతో గెలిచాం. భవిష్యత్‌లోనూ ఈ కాంబినేషన్ ఏపీలో ఉంటుందని స్పష్టం చేశారు. ప్రధాని మోడీ గ్లోబల్ లీడర్ అని ఆయన నాయకత్వంలో దేశం దూసుకుపోతుందన్నారు. 2047 నాటికి భారత్ ప్రపంచంలో ఒకటి లేదా రెండు స్థానాల్లో నిలవనుందన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వర్చువల్‌గా రూ.2.08 లక్షల కోట్ల విలువైన పలు ప్రాజెక్టులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసారు. విశాఖ రైల్వేజోన్, పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, నక్కపల్లిలో బల్క్‌పార్క్, తిరుపతి జిల్లాలో క్రిస్ సిటీకు ప్రధాని శంకుస్థాపన చేసారు. కృష్ణపట్నం ఇండస్ట్రియల్ నోడ్, గుంటూరు-బీబీనగర్ లైన్ల డబ్లింగ్ పనులు, గుత్తి-పెండేకల్లు రైల్వేలైన్ డబ్లింగ్ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేసారు. రాష్ట్రంలో 17 రోడ్ల ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసారు. చిలకలూరిపేట 6 లేన్ల బైపాస్ జాతికి అంకితం చేసారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు