2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ, డబ్బుల చెల్లింపులో పకడ్బందీగా ముందుకు వెళ్లినట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ తెలిపారు. 29,39,432 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగలిగినట్లు ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. రైతుల నుండి సేకరించిన 24 గం.లోపే రూ.5,878.49 కోట్లు చెల్లింపులు చేయడంతో 5,99,952 మంది రైతుల్లో ఆనందం వెల్లివిరిసిందన్నారు. గత ప్రభుత్వం వరి రైతులను ఎంతగా ఇబ్బందుల పాల్జేసిందో, ధాన్యం సేకరించినా డబ్బులు చెల్లించకుండా బకాయిలుపెట్టిందో అందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం ఆ రూ.1674 కోట్లు బకాయిలు చెల్లించిందని పేర్కొన్నారు. ఈమేరకు గణాంకాలతో కూడిన గ్రాఫ్ ను పోస్ట్ చేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో, డిప్యూటీ సీఎం పవన్ ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతు సౌభాగ్యం కోసం చిత్తశుద్ధితో పని చేస్తోందని స్పష్టం చేశారు.
2024-25 ఖరీఫ్ సీజన్లో ధాన్యం సేకరణ, డబ్బుల చెల్లింపులో పకడ్బందీగా ముందుకు వెళ్లాము. 29,39,432 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగలిగాము. రైతుల నుంచి సేకరించిన 24 గం.లోపే రూ.5,878.49 కోట్లు చెల్లింపులు చేయడంతో 5,99,952 మంది రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది. గత ప్రభుత్వం వరి రైతులను… pic.twitter.com/1e8e2xG26X
— Manohar Nadendla (@mnadendla) January 20, 2025