తండెల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నాగ చైతన్య మాట్లాడుతూ…నెక్ట్స్ సినిమా ఈ టీమ్ లేకుండా ఎలా చేయాలి అని భయమేసింది.అంతబాగా చూసుకున్నారు నన్ను…తండేల్ రాజుగా నేను మారడంలో ఈ టీమ్ కృషి చాలా ఉందని నాగ చైతన్య అన్నారు.శ్రీకాకుళం వెళ్లి ఈ కథకు ప్రేరణనిచ్చిన వ్యక్తుల్ని కలుసుకొని,వారి నుండి ఎన్నో విషయాలు తెలుసుకొని కష్టపడి,ఇష్టంతో ఈ సినిమా చేశామని…చందుతో నాకు ఈడి మూడో సినిమా. నేనంటే తనకు ప్రత్యేకమైన అభిమానం…అది టేకింగ్‌లో కనిపిస్తూవుంటుందని అన్నారు.
సాయిపల్లవితో కలిసి పనిచేయడానికి ఆర్టిస్టులందరూ ఉవ్విళ్లూరతారు.అంతగొప్ప కోస్టార్ ఆమె…అద్భుతమైన టీమ్ పనిచేసిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని అక్కినేని నాగచైతన్య అన్నారు.కాగా ‘తండేల్’ చిత్రానికి చందూ మొండేటి దర్శకత్వంలో వహించారు.ఈ చిత్రాన్ని గీత ఆర్ట్స్ పతాకంపై బన్నీవాసు నిర్మిస్తున్నారు.ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.అయితే ఈ చిత్రం ఈ నెల 7న విడుదల కానుంది.