యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభ మేళ కు భక్తులు భారీగా హాజరయ్యారు.నేడు వసంత పంచమి సందర్భంగా త్రివేణీ సంగమంలో అమృత స్నానాలకు భక్తులు పోటెత్తారు.చివరి అమృత్ స్నానాన్ని ఆచరించేందుకు నాగా సాధవులు,స్వామీజీలు, అఖాడాలు భారీగా తరలివచ్చారు.ఈరోజు తెల్లవారుజాము నుండే చలినిసైతం లెక్కచేయకుండా పుణ్యస్నానాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలోనే భక్తులపై నిర్వాహకులు హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు.అయితే ఈరోజు ఉదయం 8 గంటల వరకూ దాదాపు 63 లక్షల మందికిపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వెల్లడించింది.
ఈరోజు వసంత పంచమిని పురస్కరించుకుని 4 నుండి 6 కోట్ల మంది భక్తులు వస్తారని ప్రభుత్వం అంచనా వేసింది.ఈ క్రమంలో భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది.ఇటీవల మౌని అమావాస్య రోజు జరిగిన తొక్కిసలాట ఘటన దృష్ట్యా ప్రభుత్వం భారీగా ఏర్పాట్లు చేసింది.మూడంచెల భద్రత నడుమ భక్తులు అమృత స్నానాలు చేస్తున్నారు. బారికేడ్లు ఏర్పాటుచేయడంతోపాటు ఘాట్ల వద్ద సింగల్ లైన్‌లో పంపిస్తున్నారు.ఈ మేరకు ప్రయాగ్‌రాజ్ లోపలికి కార్లను అనుమతించడం లేదు.బయటి రాష్ట్రాల నుండి వచ్చే భక్తుల కోసం 84 పార్కింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
#MahaKumbhMela2025 | Prayagraj: Flower petals showered on devotees taking a holy dip at Triveni Sangam on the occasion of Basant Panchami.
As per Uttar Pradesh Information Department, today over 62.25 lakh devotees have taken a holy dip by 8 am. More than 34.97 crore devotees… pic.twitter.com/JS2p1fnQCk
— ANI (@ANI) February 3, 2025