‘కన్నప్ప’ చిత్రంలో రుద్ర అనే పవర్ ఫుల్ పాత్రలో రెబెల్ స్టార్ ప్రభాస్ కనిపించనున్నాడు.తాజా చిత్రబృందం విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ పరమ శివ భక్తుడిగా,ఒక సన్యాసి గెటప్ లో చేతిలో పొడవైన దండాన్ని పట్టుకొని కనిపించారు.పొడవాటి జుట్టు,నుదిటిన శివ నామాలు పెట్టుకొని,మెడలో పెద్ద రుద్రాక్ష మాల ధరించి డివైన్ లుక్ లో కనిపించాడు.అయితే చిత్ర నేపథ్యానికి తగ్గట్టుగా బ్యాగ్రౌండ్ లో మహా శివుడి ప్రతిరూపాన్ని మనం చూడొచ్చు.’ప్రళయ కాల రుద్రుడు..త్రికాల మార్గదర్శకుడు..శివాజ్ఞ పరిపాలకుడు” అంటూ ప్రభాస్ పాత్ర స్వభావాన్ని ఈ పోస్టర్ ద్వారా తెలిపింది చిత్రబృందం.ఈ చిత్రంలో రుద్రగా ప్రభాస్ ఫస్ట్ లుక్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంది.ఇప్పటివరకు ఎప్పుడు చూడని సరికొత్త లుక్ లో కనిపించి డార్లింగ్ అభిమానులను సర్ప్రైజ్ చేసాడని చెప్పాలి.
ఈ చిత్రంలో కన్నప్పగా మంచి విష్ణు నటిస్తున్నాడు.మంచు విష్ణు సరసన ప్రీతి ముకుందన్ హీరోయిన్ గా నటిస్తుంది.శివ పార్వతులుగా అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ నటించారు.మోహన్ లాల్,శరత్ కుమార్,మధుబాల కీలక పాత్రల్లో కనిపించనున్నారు.ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు.AVA ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్స్ పై మోహన్ బాబు నిర్మిస్తున్నారు.సమ్మర్ కానుకగా ఏప్రిల్ 25న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు.ప్రపంచ వ్యాప్తంగా ఆరు ప్రధాన భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారని చిత్రబృందం తెలిపింది.
ॐ The Powerful 'Rudra' ॐ
Unveiling Darling-Rebel Star 'Prabhas' as 'Rudra' 🔱#Kannappa🏹 #PrabhasAsRudra🔱 #HarHarMahadevॐ@iVishnuManchu @Mohanlal #Prabhas @akshaykumar @realsarathkumar #MukeshRishi @MsKajalAggarwal #PreityMukhundhan @arpitranka_30 #Aishwariyaa #Madhoo… pic.twitter.com/VoMjapotmQ
— Mohan Babu M (@themohanbabu) February 3, 2025