సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీ.బీ.ఎస్.ఈ) 10, 12 తరగతి ఎగ్జామ్స్ అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. ఈనెల 15 నుండి ప్రారంభం కానున్న ఈ ఎగ్జామ్స్ కార్డ్స్ ను అందుబాటులోకి తెచ్చారు. సీ.బీ.ఎస్.ఈ అధికారిక వెబ్సైట్ నుండి విద్యార్థులు అడ్మిట్ కార్డులు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా దాదాపు 44 లక్షల మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్స్ కు హాజరయ్యే అవకాశం ఉంది. సీ.బీ.ఎస్.ఈ పదో తరగతి ఎగ్జామ్స్ ఈనెల 15న ప్రారంభమై మార్చి 18న ముగియనుండగా…12వ తరగతి ఎగ్జామ్స్ ఫిబ్రవరి 15 నుండి ప్రారంభమై ఏప్రిల్ 4 వరకు జరుగుతాయి. వెబ్సైట్లోకి లాగిన్ అయిన తర్వాత విద్యార్థులు వారి వారి స్కూల్స్ యూజర్ ఐడీ, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థుల ఈ అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ విద్యార్థులు తమ పాఠశాలల ద్వారా వీటిని పొందొచ్చు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు