యువ కథానాయకుడు నాగచైతన్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం తండేల్.ఈ చిత్రానికి చందూమొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు.ఇందులో నాగ చైతన్యకు జోడిగా సాయిపల్లవి నటిస్తోంది.ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.ఈ మేరకు చిత్రబృందం ఇప్పటికే ప్రమోషన్స్ చేసింది.ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.
అయితే ఈ చిత్రం మరో రెండు రోజుల్లో విడుదల కానున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం టికెట్ల ధరను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.మొదటి వారం రోజులపాటు సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో రూ.50, మల్టీప్లెక్స్ లలో రూ.75 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.తాజా ధరల పెంపుతో సింగిల్ స్క్రీన్స్లో టికెట్ ధర రూ.197, మల్టీప్లెక్స్ లలో టికెట్ ధర రూ.252గా ఉంది.అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆ వెసులు బాటు లేకుండా ధరల పెంపు, బెనిఫిట్స్ షోల విషయంలో కఠిన పాలసీని అమలు చేస్తుంది.ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ సమర్పణలో బన్నీవాసు నిర్మిస్తున్నారు.