భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ జీవిత చరిత్ర ఆధారంగా ఓ చిత్రం తెరకెక్కనున్నట్లు గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి.అయితే ఈ చిత్రంలో గంగూలీ పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటుడు రాజ్ కుమార్ రావు కనిపించనున్నట్లు తెలుస్తుంది.ఈ మేరకు ఇదే విషయంపై గంగూలీ స్పందించాడు.నాకు తెలిసి నా బయోపిక్‌లో బాలీవుడ్ నటుడు రాజ్‌కుమార్ రావు నటించనున్నాడు.
అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.ఈ చిత్రం ప్రకటించిన అనంతరం తెరపైకి రావడానికి కనీసం సంవత్సరం కంటే ఎక్కువ సమయం పడుతుందంటూ” గంగూలీ అన్నారు.ఈ చిత్రానికి సంబంధించి రాజ్ కుమార్ రావుని సంప్రదించగా…ఆయన కూడా పచ్చ జెండా ఊపినట్లు తెలుస్తుంది.అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.ఈ చిత్రాన్ని లవ్ ఫిల్మ్స్ నిర్మిస్తుంది.విక్రమాదిత్య మొత్వానీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు.