నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’.ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ…విజయశాంతి గారిని తాను ‘అమ్మ’గా భావిస్తున్నానని,ఈ చిత్రంతో తమ అనుబంధం మరింత బలపడిందని అన్నారు.తల్లీకొడుకుల అనుబంధాన్ని అద్భుతంగా చూపించామని,ఈ కథను చెప్పినప్పుడు విజయశాంతి గారినే ఆ పాత్రకు ఊహించుకున్నామని చెప్పారు.విజయశాంతి కూడా కళ్యాణ్ రామ్ కొత్త దర్శకులను ప్రోత్సహిస్తారని ప్రశంసించారు.దర్శకుడు ప్రదీప్‌కు ఈ సినిమా తర్వాత మరిన్ని అవకాశాలు వస్తాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.కళ్యాణ్ రామ్ ఎక్కడా రాజీ పడకుండా నటించారని కొనియాడారు.ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది.
Previous Articleటాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో భారీ చోరీ..!
Next Article భారత్ పై బిల్ గేట్స్ ప్రశంసలు… త్వరలోనే భారత పర్యటన