ప్రముఖ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ మూడో సీజన్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మనోజ్ బాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ స్పై థ్రిల్లర్ సిరీస్ గత రెండు సీజన్లతో అమెజాన్ ప్రైమ్‌లో సంచలన విజయం సాధించింది. ప్రస్తుతం మూడో సీజన్ షూటింగ్ పూర్తయ్యి, పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈసారి కథ నార్త్ ఈస్ట్ ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో సాగనుందని చిత్ర బృందం వెల్లడించింది. ‘పాతాళ్ లోక్’ ఫేమ్ జైదీప్ అహ్లావత్ ఈ సీజన్‌లో కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. నవంబర్‌లో ఈ సిరీస్ ప్రేక్షకులను అలరించనున్నట్లు హీరో మనోజ్ బాజ్‌పాయ్ వెల్లడించాడు. మూడో సీజన్‌లో శ్రీకాంత్ తివారీ తన కుటుంబం, ఉద్యోగం, కొత్త సవాళ్లను ఎలా ఎదుర్కొన్నాడనేది ఆసక్తికరంగా ఉండబోతోంది. ఈ వెబ్ సిరీస్‌పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Previous Articleవాట్సాప్ స్టేటస్‌కు మ్యూజిక్ ఫీచర్ – యూజర్లకు కొత్త అప్డేట్
Next Article పవన్ కళ్యాణ్ ‘ఓజీ’ నుండి క్రేజీ అప్డేట్…!