పాన్ ఇండియా స్టార్ ప్రభాస్,సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’.దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ నిర్మిస్తున్నారు.ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా సెట్స్‌పైకి ఈ ఏడాది చివరిలో వెళ్లనున్నట్లు సమాచారం. ఉగాది పండుగ సందర్భంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా క్రేజీ అప్‌డేట్‌ను ప్రకటించారు‘స్పిరిట్’ చిత్రీకరణను మెక్సికోలో జరపనున్నామని,ఇందులో ప్రభాస్ మూడు కొత్త లుక్స్‌లో కనిపించబోతున్నారని వెల్లడించారు. అర్జున్ రెడ్డి,యానిమల్ తరహాలో ప్రభాస్ పాత్రను డిఫరెంట్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలుస్తోంది.వచ్చే నెలలో ప్రారంభమై, జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరగనుంది. ఆరు నెలల్లో షూటింగ్ పూర్తి చేయాలని టీమ్ ప్లాన్ చేస్తోంది. భారీ బడ్జెట్, ఇంటెన్స్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
Previous Articleఅరుణాచల్ ప్రదేశ్‌లో భూకంపం…!
Next Article ప్రధాని మోదీపై మరోసారి ప్రశంసలు కురిపించిన శశి థరూర్