అరుణాచల్ ప్రదేశ్‌లో సోమవారం మధ్యాహ్నం 2:38 గంటలకు భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 3.5గా నమోదైంది.నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, ఈ భూకంపం షియోమి జిల్లాలో భూమికి 10 కిలోమీటర్ల లోతులో కేంద్రంగా ఉంది. తీవ్రత తక్కువగా ఉండటంతో ప్రాణ,ఆస్తి నష్టం జరగలేదు.అయినప్పటికీ,భూమి కంపించడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.శుక్రవారం మయన్మార్‌లో 7.7 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది.ఈ విపత్తులో ఇప్పటివరకు 2,972 మంది మరణించారని అధికార వర్గాలు వెల్లడించాయి.క్షతగాత్రుల సంఖ్య 3,122గా ఉంది. భూకంపం కారణంగా అనేక భవనాలు ధ్వంసమయ్యాయి,ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు తీశారు.భూకంపాల వంటి ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.సురక్షిత ప్రదేశాల్లోకి వెళ్లి, అధికారుల సూచనలు పాటించడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించుకోవచ్చు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు