అగ్ర నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో క్రిష్/జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ చిత్రం ‘హరిహర వీరమల్లు: స్వోర్డ్ ఆఫ్ స్పిరిట్’ మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌పై ఏఎం రత్నం సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.తాజాగా, ఈ సినిమా విడుదల అదే సమయానికి వస్తుందా లేదా అనే డౌట్ కు స్పష్టతనిచ్చింది. రీరికార్డింగ్, వీఎఫ్ఎక్స్, డబ్బింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోందని చిత్ర నిర్మాణ సంస్థ తెలిపింది. ఈమేరకు కొత్త పోస్టర్ ను విడుదల చేసింది.మే9న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపింది. వేసవిలో ప్రేక్షకులను అలరించేందుకు బిగ్గెస్ట్ సినిమాటిక్ అద్భుతాన్ని తీసుకొస్తున్నామని ప్రకటించింది. ఈ మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా,ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా టీజర్, పోస్టర్స్ ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంటుండగా, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ భారీగా వేడుకలకు సిద్ధమవుతున్నారు.పీరియాడిక్ యాక్షన్ నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రం పవన్‌కు మరో క్రేజీ ప్రాజెక్ట్‌గా నిలవనుంది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు