ప్రతిపక్షాలపై మరోసారి ప్రధాని మోడీ తనదైన శైలిలో విమర్శలు గుప్పించారు. వారు అధికార వ్యామోహంతో కుటుంబ ప్రయోజనాలపై మాత్రమే దృష్టి సారిస్తున్నారని మండిపడ్డారు. అయితే తమ ప్రభుత్వం మాత్రం అందరి అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తుందని స్పష్టం చేశారు. పూలే దంపతులను ఆదర్శంగా తీసుకొని మహిళల విద్యా, అభివృద్ధి కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసి లో రూ.3880 కోట్ల విలువైన 44 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి ప్రసంగించారు. ప్రస్తుతం ప్రారంభించిన ప్రాజెక్టులు గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేస్తాయని తెలిపారు. వాటిలో 130 తాగునీటి ప్రాజెక్టులు, 100 కొత్త అంగన్వాడీ సెంటర్లు, 356 లైబ్రరీలు, పాలిటెక్నిక్ కాలేజీలు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ ఉన్నట్లు ప్రధాని మోడీ తెలిపారు. తన సొంత నియోజకవర్గం కాశీ ఎప్పటికీ తనదేనని తాను కాశీకి చెందిన వాడినని పునరుద్ఘాటించారు.
గతంలో పూర్వాంచల్ లో హెల్త్ ఫెసిలిటీస్ తక్కువగా ఉండేవని అయితే నేడు కాశీ పూర్వాంచల్ కు హెల్త్ క్యాపిటల్ గా మారుతుందని పేర్కొన్నారు. భారత్ వారసత్వం, అభివృద్ధి అనే రెండింటితో ముందుకు సాగుతుందన్నారు. 2036లో నిర్వహించే ఒలింపిక్స్ కు భారత్ ఆతిథ్యం ఇవ్వాలనుకుంటే ఓం దీని దాని అనుమతి కోసం అధికారులు ప్రయత్నాలు చేస్తున్నట్లు వివరించారు.
విపక్షాలపై ప్రధాని మోడీ విమర్శలు…యూపీలో పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం
By admin1 Min Read