నట సింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం తాజాగా అంతర్జాతీయ గుర్తింపు దక్కించుకుంది.ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదలై థియేటర్లలో హిట్‌గా నిలిచిన ఈ సినిమా, ఇప్పుడు ఇరాక్‌కు చెందిన ప్రముఖ అరబిక్ పత్రికలో ప్రత్యేక కథనంగా ప్రచురితమై చర్చనీయాంశమైంది.ఈ వార్త తెలియగానే బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో హర్షం వ్యక్తం చేస్తున్నారు.పత్రిక కథనం ప్రకారం, సినిమాలోని యాక్షన్ సన్నివేశాలు, వినియోగించిన సాంకేతికత అత్యున్నత స్థాయిలో ఉండటమే కాక, బాలకృష్ణ పోషించిన పాత్రను రాబిన్‌హుడ్ తరహాలో ప్రజల అండగా నిలిచే శక్తిమంత పాత్రగా వివరించారు.
బాక్సాఫీస్ వద్ద సినిమా సాధించిన వసూళ్లు, ప్రజాదరణను కూడా వివరంగా విశ్లేషించారు. అరబిక్ పత్రికల్లో తెలుగు సినిమాకు ఇంత పెద్ద స్థాయి కవరేజ్ రావడం అరుదైన విషయం కావడంతో, ఇది తెలుగు పరిశ్రమకు గర్వకారణంగా మారింది. బాలయ్య సరసన ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ నటించగా, ఊర్వశీ రౌతేలా ప్రత్యేక గీతంలో అలరించింది. ప్రతినాయకుడిగా బాబీ డియోల్ పోషించిన పాత్ర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. నెట్‌ఫ్లిక్స్ వేదికపై ఈ సినిమా ట్రెండింగ్‌లో కొనసాగుతూ, ఇప్పటికీ మంచి ఆదరణను పొందుతోంది.