అఫ్గానిస్థాన్‌లో బుధవారం తెల్లవారుజామున భూకంపం భయానక దెబ్బకు గురి చేసింది.రిక్టర్ స్కేలు పై 5.9 మాగ్నిట్యూడ్ తీవ్రతతో వచ్చిన ఈ భూకంప కేంద్రం,బాగ్లాన్ నగరానికి 164 కిలోమీటర్ల దూరంలో,121 కిలోమీటర్ల లోతులో నమోదు అయింది.అయితే మొదట ఇది 6.4 మాగ్నిట్యూడ్ గా నమోదు అయిందని యూరోపియన్ మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ (EMSC) ప్రకటించింది. ఈ ప్రకంపనలు అఫ్గాన్‌తో పాటు భారత్‌లోని ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతాల వరకు ప్రభావం చూపినట్టు తెలుస్తోంది.ఢిల్లీ ప్రాంత ప్రజలు స్వల్పంగా భూప్రకంపనలు అనుభవించారని స్థానిక నివాసితులు తెలిపారు. అయితే ఇప్పటివరకు అఫ్గాన్ భూకంపానికి సంబంధించి ప్రాణ, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.అధికార యంత్రాంగం పరిస్థితిని సమీక్షిస్తూ అప్రమత్తంగా ఉందని సమాచారం.తరచూ భూకంపాలు ఎదుర్కొంటున్న అఫ్గానిస్థాన్ ఈసారి కూడా ప్రకృతి ప్రకోపాన్ని ఎదుర్కొంటున్నది.
అఫ్గానిస్థాన్‌లో 5.9 తీవ్రతతో భూకంపం….ఢిల్లీ వరకు ప్రకంపనలు…!
By admin1 Min Read