బంగారం ధర దూసుకెళ్తోంది. అంతర్జాతీయ స్థాయిలో అలాగే దేశీయంగానూ రోజురోజుకూ పరుగులు పెడుతూ సామాన్యుడికి మరింత దూరంగా జరుగుతోంది. అమెరికా-చైనాల మధ్య రెసిప్రొకల్ టారిఫ్ వార్ నేపథ్యంలో బంగారం, వెండి లోహాలపై పెట్టుబడులకు ఇన్వెస్టర్లు ఆసక్తి కనబరుస్తుండడంతో పసిడి రేటు పరుగులు పెడుతోంది. అంతర్జాతీయంగా ఔన్సు 24 క్యారెట్ ల గోల్డ్ రేటు మొన్నటితో పోలిస్తే 107 డాలర్లకు మించి పెరిగి, 3330 డాలర్లకు చేరింది. భారత్ లో కూడా భారీగా పెరిగింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నిన్న రాత్రి 11.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,400కి చేరింది. కిలో వెండి ధర రూ.98,900 వద్ద ట్రేడ్ అవుతోంది. దేశీయ కమొడిటీ ఎక్స్ఛేంజ్ లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర గరిష్ఠంగా రూ.95,732ను చేరి చివరకు రూ.93,451 వద్ద ముగిసింది.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు