నందమూరి హరికృష్ణ మనవడు, జానకీరామ్ కుమారుడు నందమూరి తారక రామారావు హీరోగా పరిచయం కాబోతున్నారు. ప్రముఖ దర్శకుడు వైవీఎస్ చౌదరి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. మూవీ ప్రారంభత్సవ కార్యక్రమానికి నారా భువనేశ్వరి, దుగ్గబాటి పురందేశ్వరి, గారపాటి లోకేశ్వరి హాజరయ్యారు. నారా భువనేశ్వరి హీరో హీరోయిన్లపై క్లాప్ కొట్టి అభినందించారు. ఇక మరోవైపు ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు తారక రామారావుకు ఆల్ ది బెస్ట్ చెబుతూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఎన్‌టీఆర్ గొప్ప విజయాలు అందుకోవాలని ఆయన ఆకాంక్షించారు. “తారక రామారావు ఇండస్ట్రీలో అడుగుపెడుతోన్న సందర్భంగా ఆయనకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఎన్‌టీఆర్ గొప్ప విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నానని సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.
Previous Article‘ఆపరేషన్ సింధూర్’ పై భారత రక్షణ అధికారుల మీడియా సమావేశం
Next Article మన సైన్యానికి సెల్యూట్: ప్రధాని మోడీ