దేశ ప్రజలనుద్దేశించి ప్రధాని నరేంద్ర మోడీ నేడు ప్రసంగించారు. ‘ఆపరేషన్ సిందూర్’ తరువాత ఆయన మొదటి సారి దేశ ప్రజలకు సందేశం ఇచ్చారు. మన బలగాలకు సెల్యూట్ చేస్తూ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. ఆపరేషన్ సింధూర్‌లో సాహసోపేతమైన ప్రదర్శన చేశారని భద్రతా దళాలను కొనియాడారు. పర్యాటకులను వారి కుటుంబ సభ్యుల ఎదుటే చంపారని మన తల్లుల బొట్టు చెరిపితే ఏం జరుగుతుందో చూపించామని పేర్కొన్నారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదంపై పోరుమొదలుపెట్టామని స్పష్టం చేశారు. పాక్ లోని ఉగ్రవాద స్థావరాలు, శిబిరాలు ధ్వంసం చేశామని తెలిపారు.మన సైన్యం అసాధారణ ధైర్యాన్ని ప్రదర్శించింది. పాకిస్తాన్‌తో చర్చలు జరపాల్సి వస్తేఉగ్రవాదం, పీవోకేపై మాత్రమే జరుగుతాయి. పాక్‌కు పీవోకేను వదలడం తప్ప గత్యంతరం లేదని పునరుద్ఘాటించారు. సైనికుల సాహస, పరాక్రమాలు దేశ మహిళలకు అంకితమని అన్నారు. రక్షణ దళాలు చేసిన సాహసం దేశానికే తలమానికం. ఉగ్రదాడి తర్వాత దేశం ఒక్కటిగా నిలిచిన సందర్భాన్ని ప్రస్తావించారు. పాకిస్తాన్‌లోని ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేశాం. ఉగ్రవాదులను భారత క్షిపణులు, డ్రోన్‌లు హతమార్చాయి. గ్లోబల్ టెర్రరిజానికి బహావల్పూర్ ఒక యూనివర్సిటీ లాంటిదని దానిని ధ్వంసం చేశామన్నారు. భారత్ చర్యలతో పాక్ నిరాశ,నిస్పృహల్లో కూరుకుపోయిందని పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని సహించమని కఠిన చర్యలు కొనసాగిస్తామని తెలిపారు. భారత త్రివిధ దళాలు అప్రమత్తంగా ఉన్నాయని పేర్కొన్నారు.భారత్ పై మళ్లీ దాడిచేస్తే తగిన సమాధానం చెబుతామన్నారు. అణుబాంబుల పేరుతో భారత్ ను ఎవరూ బెదిరించలేరని పేర్కొన్నారు. భారత్ మాతా కీ జై అంటూ ప్రధాని మోడీ తన ప్రసంగాన్ని ముగించారు.
Trending
- ఈ ప్రభుత్వం చెత్త నుంచి సంపద వచ్చేలా చూస్తుంది: ఏపీ సీఎం చంద్రబాబు
- త్యాగధనుడు, తెలుగుజాతి సాహసానికి ప్రతీక టంగుటూరికి ఏపీ సీఎం చంద్రబాబు నివాళులు
- గత 14నెలలుగా సమర్థంగా సంస్కరణలు అమలుచేశాం: మంత్రి నారా లోకేష్
- అవినీతిపై ఎన్డీయే ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించబోతోంది: ప్రధాని మోడీ
- కృష్ణా,గోదావరి నదుల్లో వరద ప్రవాహాలపై సీఎం చంద్రబాబు సమీక్ష
- ‘మన శంకరవరప్రసాద్ గారు’…’పండగకి వస్తున్నారు..’ స్టైలిష్ లుక్ లో చిరు
- ఆసియా కప్ లో ఓకే… ద్వైపాక్షిక సిరీస్ లు ఉండవు
- సెలక్షన్ కమిటీ ఛైర్మన్ గా అజిత్ అగార్కర్ పదవీకాలం పొడిగింపు