మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘భైరవం’ . తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. మే 30న విడుదల కానున్న ఈ చిత్రాన్ని ‘నాంది’ ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వం వహించారు. కె.కె.రాధా మోహన్ నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం సమకూర్చారు. ముగ్గురు మిత్రుల కథతో, దేవాలయం నేపథ్యంగా సాగుతుంది. ట్రైలర్‌లో యాక్షన్, ఎమోషన్స్ ఆకట్టుకుంటున్నాయి. హీరోయిన్‌లుగా ఆదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది నటించారు.
Previous Articleనవంబర్ లో నంది నాటకోత్సవాలు, నంది అవార్డుల ప్రధానం
Next Article దేశద్రోహుల పని పడుతోన్న భారత నిఘా వర్గాలు