పహాల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ఉగ్రవాదంపై పోరాటం మరింత తీవ్రతరం చేసిన సంగతి తెలిసిందే. అలాగే దేశంలోనే ఉంటూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు దేశ ద్రోహానికి పాల్పడుతున్న వారిని కూడా ఏరివేస్తోంది. పాకిస్థాన్ కు గూఢచర్యం చేస్తూ చిక్కిన హర్యానాకు చెందిన యూట్యూబ్ జ్యోతి మల్హోత్రా సహా పలువురిని అరెస్టు చేయగా… తాజాగా ఉత్తర ప్రదేశ్ కు చెందిన షాజాద్ అనే ఒక వ్యాపారిని కూడా గూఢచర్యం ఆరోపణలతో అరెస్టు చేసినట్లు స్పెషల్ టాస్క్ ఫోర్స్ తెలిపింది. రాంపూర్ కు చెందిన వ్యాపారి పాకిస్థాన్ కు చెందిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ తరపున సరిహద్దుల్లో అక్రమ రవాణా, గూఢచర్యం చేస్తున్నట్లు గుర్తించినట్లు అధికారులు పేర్కొన్నారు. శత్రు దేశంతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ జాతీయ భద్రతకు సంబంధించిన సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పాక్ కు చేరవేస్తున్నట్లు గుర్తించినట్లు పేర్కొన్నారు. పలుమార్లు పాక్ కు కూడా వెళ్లి వచ్చినట్లు తెలిపారు. బిజినెస్ ముసుగులో ఈ నీచుడు ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడేవాడు. భారత్ లో పలు సిమ్ కార్డులు కొని ఐఎస్ఐ ఏజెంట్లకు పంపడం, యూపీలోని పలువురు యువకులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహించి పాక్ కు పంపించడం వంటి పనులు చేసేవాడిని తెలిపారు.
Previous Articleవిడుదలైన ‘భైరవం’ ట్రైలర్
Next Article పలు దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులు..!