బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు ఆగడం లేదు.గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ నుంచి ఆయనకు ఇప్పటికే పలు మార్లు బెదిరింపులు వచ్చాయి.తాజాగా మరోసారి ఆయన వీటిని ఎదుర్కొన్నారు.ముంబయిలో బుధవారం రాత్రి ఆయన సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి సెట్ లోకి అడుగు పెట్టాడు.లారెన్స్ బిష్ణోయ్ పేరు చెబుతూ బెదిరింపులు పాల్పడ్డాడు.దీంతో అక్కడ ఉన్న వారంతా ఆ వ్యక్తిని పట్టుకున్నారు.పోలీసులకు సమాచారం ఇచ్చారు.పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ కు లారెన్స్ గ్యాంగ్ నుంచి ఇంతకాలంగా బెదిరింపులు వస్తున్నాయి.తాము ఎంతగానో పూజించే కృష్ణ జింకలను వెతాడినందుకు సల్మాన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని ఇప్పటికే పలుమార్లు లారెన్స్ ముఠా డిమాండ్ చేసింది.క్షమాపణలు చెబితే చేయని తప్పును అంగీకరించినట్టు అని అందుకే సల్మాన్ ఆ పని చేయడని ఆయన తండ్రి సలీం ఖాన్ గతంలో అన్నారు.
Previous Articleపరారీలో ఉగ్రవాదులు, హంతకులు
Next Article అల్లు అర్జున్ కు లేఖ రాసిన ఆయాన్