రెబల్ స్టార్ ప్రభాస్ కథనాయకుడిగా, దర్శకుడు మారుతి దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు.ఇందులో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ లు కథానాయికలుగా నటిస్తున్నారు.ఈ చిత్రం వేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.
తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త వినిపిస్తోంది.ఇందులో ప్రభాస్ తో కలిసి నయనతార ఒక ప్రత్యేక పాటలో ఆడిపాడనున్నట్టు సమాచారం.ఇప్పటికే ఆమెతో దర్శక-నిర్మాతలు సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది.ఈ నెలాఖరులో పాటను చిత్రీకరించే అవకాశం ఉంది.వచ్చే సంవత్సరం ఏప్రిల్ 10న ఈ చిత్రం విడుదల చేయనున్నారు.