ఎనిమిది ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మిజోరాం, త్రిపుర, సిక్కింలను సెవెన్ సిస్టర్స్ గా పిలుస్తారనే సంగతి తెలిసిందే. కాగా ఈ రాష్ట్రాలకు చెందిన 250పైగా ఉన్న సాంప్రదాయ హస్తకళలు, మరియు జీఐ ట్యాగ్ పొందిన ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు, వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ పెంచడం మరియు పర్యాటక రంగంలో ఆర్థిక అవకాశాలను కల్పించడమే లక్ష్యంగా ‘అష్టలక్ష్మీ మహోత్సవం’ నిర్వహిస్తున్నారు. ఈశాన్య రాష్ట్ర ప్రజల సంస్కృతులు, చేనేతవస్త్రాలు, హస్తకళలను, , వారి వైవిధ్యమైన జీవన శైలిని ప్రపంచానికి, భారతదేశానికి పరిచయం చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ డిసెంబర్ 6, 2024 అష్టలక్ష్మీ మహోత్సవాన్ని ప్రారంభించనున్నారు. ఇది డిసెంబర్ 6 నుంచి 8 వరకు ఢిల్లీలోని భారత మండపంలోని ప్రగతి మైదాన్ లో జరుగుతోంది. ఈ ఎనిమిది రాష్ట్రాలను అష్టలక్ష్ములుగా పిలవబడే లక్ష్మీ దేవత యొక్క ఎనిమిది రూపాలైన ఐశ్వర్యం, శ్రేయస్సు, స్వచ్ఛత, సంపద, జ్ఞానం, కర్తవ్యం, వ్యవసాయం మరియు పశుసంవర్థకను సూచిస్తాయి. ఈ కార్యక్రమం ఈశాన్యంలోని వివిధ రాష్ట్రాల యొక్క శక్తివంతమైన సంస్కృతిని ప్రతిబింబిస్తుందని ముఖ్యంగా టూరిజం, టెక్స్‌టైల్స్, హస్తకళలు మరియు మరిన్ని రంగాలలో ఈ ప్రాంతానికి సంబంధించిన పెట్టుబడి మరియు ఆర్థిక కార్యకలాపాలను ప్రోత్సహించడంపై కూడా దృష్టి కేంద్రీకరించేందుకు దోహదం చేస్తుందని ప్రధాని మోడీ పేర్కొన్నారు.
ఈశాన్య రాష్ట్రాల సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా ‘అష్టలక్ష్మీ మహోత్సవం’
By admin1 Min Read