నటి రకుల్ ప్రీత్ సింగ్‌కు కొంతకాలం క్రితం వెన్ను గాయమైన విషయం తెలిసిందే.తాజాగా ఆమె తన ఆరోగ్యం గురించి అప్‌డేట్ ఇచ్చారు.తాను ప్రస్తుతం కోలుకుంటున్నానని అన్నారు.శరీరం చెప్పే మాట వినాలని దాన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదన్నారు. తాను చేసిన తప్పు మరెవరూ చేయొద్దని తెలిపారు. గాయమైనప్పుడు నేను పెద్దగా లెక్క చేయలేదు.రెండు వారాల్లో తగ్గిపోతుందనుకున్నా.తీరా చూస్తే ఇప్పటికి ఎనిమిది వారాలు అయింది.ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.త్వరలో పూర్తిస్థాయిలో కోలుకుంటా.నేను చెప్పేది ఒక్కటే నేను చేసిన తప్పు మీరు చేయొద్దు అన్నారు.80కేజీల బరువు ఎత్తుతున్నప్పుడు రకుల్‌కు గాయమైన సంగతి విధితమే. గాయాన్ని ఆమె లెక్క చేయలేదు.నొప్పి తీవ్రతరం కావడంతో వైద్యులను సంప్రదించగా..కొన్ని వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని సూచించారు.
Previous Articleన్యూ ఢిల్లీ రాజకీయాల్లో పుష్ప 2 పోస్టర్లు హవా…!
Next Article మంచు మనోజ్‌పై కేసు నమోదు

