నటుడు మంచు మనోజ్,ఆయన సతీమణి మౌనికపై కేసు నమోదైంది.కుటుంబంలో కలహాలు తలెత్తడంతో మనోజ్‌పై ఆయన తండ్రి మోహన్ బాబు నిన్న సాయంత్రం రాచకొండ కమిషనర్‌కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.ఆస్తుల విషయంలో తగాదాలు ఏర్పడ్డాయని ఫిర్యాదులో పేర్కోన్నారు.ఆగంతకులతో కలిసి ఆస్తులు ధ్వంసం చేస్తున్నారని ఆరోపించారు. ఈనేపథ్యంలోనే మనోజ్ – మోనిక దంపతులపై పహాడీ షరీఫ్ పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు, మనోజ్ కూడా నిన్న పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.విజయ్ రెడ్డి, కిరణ్ అనే వ్యక్తులపై ఆయన నిన్న పహాడీ షరీఫ్‌లో ఫిర్యాదు చేశారు.
Previous Articleనేను చేసిన తప్పు చేయొద్దు:రకుల్ ప్రీత్ సింగ్
Next Article వినూత్న బ్యాగులను ధరించి విపక్ష ఎంపీల నిరసన