దేశ రాజధాని న్యూఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.ఎన్నికల సమయం దగ్గరవుతున్న కొద్దీ అక్కడ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.ఇటీవల విడుదలైన పుష్ప 2 పోస్టర్లతో అధికార, ప్రత్యర్థి పార్టీల మధ్య వాడి వేడి రాజకీయం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసిన బీజేపీ, ఆప్ పార్టీలు…సోషల్ మీడియా సహా అన్ని మాధ్యమాల ద్వారా ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.ఈ క్రమంలో కేజ్రీవాల్ ‘ఝుకేగా నహీ (తగ్గేదేలే)’ అంటూ ఆమ్‌ఆద్మీ పార్టీ ఇటీవల ఓ పోస్టర్ విడుదల చేసింది.పుష్ప సినిమాలో హీరో పోజులో ఉన్న కేజ్రీవాల్..చీపురు చేత పట్టుకొని నాలుగోసారి మళ్లీ అధికారం తమదేనని ఆ పార్టీ పేర్కొంది.దీనికి బీజేపీ దీటుగా సమాధానం ఇచ్చింది.పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ్…పుష్ప క్యారక్టెర్ తరహాలోనే కుర్చీలో కూర్చున్నట్లు దానిని రూపొందించారు.‘అవినీతిపరులను అంతం చేస్తామంటూ.. ‘రప్పా-రప్పా’ అని రాసి ఉన్న ఆ పోస్టర్‌ను ఆ పార్టీ విడుదల చేయడంతో దిల్లీ రాజకీయాలు ఆసక్తిగా మారాయి.ప్రస్తుతం ఇవి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి.
Previous Articleకర్ణాటక మాజీ సీఎం ఎస్.ఎమ్.కృష్ణ కన్నుమూత
Next Article నేను చేసిన తప్పు చేయొద్దు:రకుల్ ప్రీత్ సింగ్