పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోడీ, అదానీ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతున్న సంగతి తెలిసిందే. అదానీపై వచ్చిన ఆరోపణల. నేపధ్యంలో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక నేడు వినూత్నంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అదానీ మోడీ చిత్రాలతో ఉన్న బ్యాగులతో విపక్ష ఎంపీలతో కలిసి పార్లమెంటు ఆవరణలో నిరసనలు తెలిపారు. కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రాతో సహా పలువురు విపక్ష ఎంపీలు వినూత్న బ్యాగులను ధరించి వచ్చారు. ఈక్రమంలో ప్రియాంక గాంధీ వాద్రా వద్ద ఉన్న బ్యాగును రాహుల్ గాంధీ పరిశీలించారు. అనంతరం ఆ బ్యాగులను ధరించి ఆయన కూడా నిరసన తెలిపారు.
Previous Articleమంచు మనోజ్‌పై కేసు నమోదు
Next Article నాకు న్యాయం చేయండి: మంచు మనోజ్ బహిరంగ లేఖ