ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి,పవర్ స్టార్,పవన్ కళ్యాణ్ ప్రపంచవ్యాప్తంగా గూగుల్ అత్యధికంగా శోధించిన రెండవ నటుడిగా అవతరించారు.2024లో ఎక్కువగా సెర్చ్ చేసిన నటుల జాబితాను సంస్థ విడుదల చేసింది.ఇందులో హాస్య నటుడు కాట్ విలియమ్స్ అగ్రస్థానంలో నిలిచారు.నటుడిగా, రాజకీయ వేత్తగా ఈ ఏడాది పవన్ టాక్ ఆఫ్ ది టౌన్గా నిలవడంతో ఆయన గురించి తెలుసుకునేందుకు తెగ సెర్చ్ చేశారని గూగుల్ పేర్కొంది.ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఈ జాబితాలో అత్యుత్తమ స్థానం దక్కించుకున్న భారతీయ నటుడు కూడా పవన్ కళ్యాణ్ మాత్రమే.
ఈ జాబితాలో భారత్ నుంచి హీనా ఖాన్, నిమ్రత్ కౌర్ కూడా ఉండటం విశేషం.
ప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో అత్యధికంగా వెతికినా రెండో వ్యక్తిగా పవన్ కళ్యాణ్…!
By admin1 Min Read