వివాహితులైన మహిళల రక్షణార్ధం ఉద్దేశించిన చట్టాన్ని దుర్వినియోగపరుస్తున్నారంటూ దేశ అత్యున్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అత్తవారింట్లో భర్త మరియు వారి తరపు కుటుంబ సభ్యుల వేధింపుల నుండి రక్షణ కల్పించడం కోసం తీసుకువచ్చిన 498 ఏ చట్టాన్ని కొందరు వ్యక్తిగత కక్ష సాధించడం కోసం తప్పుడు కేసులు పెడుతున్నారని ఆక్షేపించింది. పోలీసులు, యంత్రాంగం ఈ విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని, వ్యక్తిగత కక్ష సాధింపులకు తావు ఇవ్వకూడదని స్పష్టం చేసింది. ఈమేరకు తెలంగాణకు సంబంధించిన ఓ కేసు విచారణలో భారత అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
పెళ్లి రద్దు చేయాలంటూ తాను కోర్టుకెక్కితే భార్య తనపై వేధింపుల కేసు పెట్టిందని, తప్పుడు ఉద్దేశంతో కక్ష సాధింపు కోసం పెట్టిన ఈ కేసును కొట్టేయాలని తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి సుప్రీంను ఆశ్రయించారు. తెలంగాణ హైకోర్టు తన పిటిషన్ ను కొట్టేయడంతో సుప్రీంలో ఈ పిటిషన్ వేశారు. దీనిని విచారించిన జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ల ధర్మాసనం తెలంగాణ హైకోర్టు తీరును తప్పుబట్టింది.
ఐపీసీ సెక్షన్ 498 ఏ లేదా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) లోని సెక్షన్ 86ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారని భర్త వైపు వారిపై కక్ష సాధించేందుకు ఈ చట్టాన్ని భార్య ఒక ఆయుధంగా మార్చుకుంటోందని విమర్శించింది. దేశవ్యాప్తంగా ఇలాంటి కేసులు పెరుగుతుండడంపై సుప్రీం బెంచ్ ఆందోళన వ్యక్తం చేసింది. నిరాధార ఆరోపణల కారణంగా అమాయకులు కేసుల్లో ఇరికింపబడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది.
రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాన్ని దుర్వినియోగం చేయడం సరికాదు: సుప్రీంకోర్టు
By admin1 Min Read
Previous Articleప్రపంచ వ్యాప్తంగా గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో అత్యధికంగా వెతికినా రెండో వ్యక్తిగా పవన్ కళ్యాణ్…!
Next Article సిరియా నుండి భారతీయుల తరలింపు..!