తాను ఇంట్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు నటుడు మోహన్ బాబు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్ట్ పెట్టారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారు.! ముందస్తు బెయిల్ తిరస్కరించబడలేదు మరియు ప్రస్తుతం నేను మా ఇంట్లో వైద్యుల సంరక్షణలో ఉన్నాను. వాస్తవాలను బయటపెట్టాలని మీడియాను కోరుతున్నాను అని ఆయన పేర్కొన్నారు. విలేకరిపై దాడి కేసులో మోహన్ బాబుకు ఊరట లభించలేదని వార్తలు వచ్చాయి. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ లో పోలీసులు అరెస్ట్ చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిందని ఆ వార్తల సారాంశం. ఈనేపథ్యంలో మోహన్ బాబు ఆ వార్తలను ఖండిస్తూ పోస్ట్ చేశారు.
Previous Articleన్యూయార్క్ లో అనుమానాస్పద డ్రోన్ల కలకలం
Next Article అల్లు అర్జున్ ను పరామర్శించనున్న ప్రభాస్!