జైలు నుండి ఇంటికి చేరుకున్న హీరో అల్లు అర్జున్ ను పరామర్శించేందుకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు తరలివస్తున్నారు. ఈక్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా రానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. సాయంత్రం 4 గంటలకు డార్లింగ్ వస్తారని తెలిపాయి. ఇప్పటికే విజయ్ దేవరకొండ, రానా, సుధీర్ బాబు తదితర నటీనటులు బన్నీ నివాసానికి వచ్చారు.
మేనల్లుడిని చూసి భావోద్వేగానికి గురైన చిరంజీవి సతీమణి సురేఖ…!
మేనల్లుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను మెగాస్టార్ చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖ పరామర్శించారు. జైలు నుంచి విడుదలై ఇంటికి చేరుకున్న ఆయన్ను చూడగానే ఆమె భావోద్వేగానికి గురయ్యారు. హత్తుకుని ఎమోషనల్ అయ్యారు. ఘటనకు సంబంధించిన విషయాలపై ఆరా తీశారు. ఆ తర్వాత బన్నీ కూడా ఆమె చేతిపై ముద్దు పెట్టి మేనత్తకు ధైర్యం చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.