నరసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే.ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆయన సినిమా చేయనున్నారు.ఈ సినిమా కోసం మోక్షజ్ఞ సన్నద్ధం అవుతున్నారు.ఇదిలా ఉండగా…ఈ సినిమా ఆగిపోయింది అంటూ వార్తలు తాజాగా చక్కర్లు కొడుతున్నాయి.ప్రశాంత్ వర్మ రెమ్యునరేషన్ ఎక్కువగా డిమాండ్ చేశారని అందుకే ఈ చిత్రం నిలిపివేయాలని టీమ్ భావించిందని ఈరోజు జోరుగా ప్రచారం జరిగింది.దీనిపై తాజాగా చిత్ర బృందం స్పందించింది.ఆయా కథనాల్లో నిజం లేదని చెప్పింది.ఇలాంటి వార్తలు నమ్మ వద్దని పేర్కొంది.సరైన సమయంలో సినిమా ప్రారంభం కానుందని చెప్పింది.
Previous Articleకేంద్ర మంత్రిని కలిసిన బండి సంజయ్…!
Next Article కేరళలో మంకీ ఫాక్స్ కలకలం.. రెండు కేసులు నమోదు