పుష్ప 2 ప్రమోషన్లలో భాగంగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన పొరపాటుకు నటి రష్మిక సారీ చెప్పారు.తప్పు తనదే అని తెలిపారు.తాను చేసిన తప్పును ఉద్దేశించి ఒక నెటిజన్ పోస్ట్ పెట్టగా.. ‘అవును…తెలుసు.. సారీ..ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అనుకున్నా అరేయ్ ఒక్కడు రీమేక్ గిల్లి.. పోకిరి రీమేక్ పొక్కిరి.ఇప్పుడు సోషల్ మీడియాలో నన్ను ట్రోల్ చేస్తుంటారు.ఏది ఏమైనా తప్పు నాదే.కానీ ఆసినిమాలు అన్ని నాకు ఇష్టమే ‘ అని రష్మిక తెలిపారు.ఇటీవల జరిగిన ఇంటర్వ్యూ లో కోలీవుడ్ హీరో విజయ్ అంటే తనకు ఎంత ఇష్టమో రష్మిక చెప్పారు.ఆయన సినిమాల గురించి మాట్లాడారు.ఆ సమయంలో గిల్లి సినిమా తెలుగు సినిమా పోకిరి రీమేక్ అని తాను తెలుసుకున్నానని తప్పుగా చెప్పారు.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Previous Articleఏపీలోని గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉంది: మంత్రి లోకేష్
Next Article కార్గిల్ వార్.. ఆ గొర్రెల కాపరి కన్నుమూత…!

