గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉంది కూటమి ప్రభుత్వం ఉందని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు. పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ, వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారని పేర్కొన్నారు. ఎస్.కోట పోలీసులు డిసెంబరు 19న బొడ్డవర చెక్ పోస్టు వద్ద కేరళ రాష్ట్రానికి తరలిస్తున్న 117 కిలోల గంజాయిని చాకచక్యంగా పట్టుకున్నారు. సినిమాల్లో స్మగ్లర్ల మాదిరి వాహనంలోనే సెపరేట్ డెన్‌లో రవాణా చేస్తున్న గంజాయిని పట్టుకున్న పోలీసులను అభినందిస్తూ మంత్రి లోకేష్ ‘ఎక్స్’ లో ట్వీట్ చేశారు.
గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉంది కూటమి ప్రభుత్వం. పోలీస్, ఎక్సైజ్, రెవెన్యూ, వివిధ ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో గంజాయి రవాణాకు అడ్డుకట్ట వేస్తున్నారు. ఎస్.కోట పోలీసులు డిసెంబరు 19న బొడ్డవర చెక్ పోస్టు వద్ద కేరళ రాష్ట్రానికి… pic.twitter.com/13Kikst8v3
— Lokesh Nara (@naralokesh) December 20, 2024