కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. ధరలు పెరుగుదలకు సంబంధించి కేంద్రంపై మండిపడ్డారు. ప్రజలు పెరిగిన ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతోందని సోషల్ మీడియా ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు.
కొద్ది రోజుల క్రితం ఒక కూరగాయల మార్కెట్ కు వెళ్లిన వీడియో ఆయన ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. అక్కడ స్థానికులతో మాట్లాడినట్లు తెలిపారు. ధరలు పెరుగుదలతో సామాన్యులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. వెల్లుల్లి ఒకప్పుడు ₹40, నేడు ₹400! అయిందని పేర్కొన్నారు. పెరుగుతున్న ద్రవ్యోల్బణం సామాన్యుడి వంటగది బడ్జెట్‌ను పెంచుతోందని అన్నారు. ప్రభుత్వం కుంభకర్ణుడిలా నిద్రపోతుందని దుయ్యబట్టారు.
“लहसुन कभी ₹40 था, आज ₹400!”
बढ़ती महंगाई ने बिगाड़ा आम आदमी की रसोई का बजट – कुंभकरण की नींद सो रही सरकार! pic.twitter.com/U9RX7HEc8A
— Rahul Gandhi (@RahulGandhi) December 24, 2024