హిమాచల్ ప్రదేశ్ లోని ప్రముఖ పర్యాటక ప్రదేశమైన మనాలీని మంచు కప్పేసింది. క్రిస్మస్, నూతన సంవత్సరం నేపథ్యంలో ప్రతి సంవత్సరం డిసెంబరు చివరి వారంలో మనాలీకి పర్యటకుల రద్దీ విపరీతంగా ఉంటుంది. మంచు దట్టంగా కురుస్తుండటంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. వాహనాలు ముందుకుకదల్లేక భారీగా ట్రాఫిక్ జామ్ కాగా, రంగంలోకి దిగిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ట్రాఫిక్ ను పునరుద్దరిస్తున్నారు. వీటికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి.
గత కొన్ని రోజులుగా మంచు కురుస్తుండటంతో మనాలీకి పర్యటకులు భారీగా తరలివచ్చారు. హిమాచల్ రాజధాని సిమ్లాలోనూ మంచు కురుస్తోంది. హిమపాతం కారణంగా రాష్ట్రంలోని పలు రోడ్లను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. ఈ సీజన్ లో వేల సంఖ్యలో వాహనాలు ఈ ప్రాంతానికి వచ్చాయని అధికారులు తెలిపారు.
ప్రముఖ పర్యాటక ప్రాంతం మనాలీపై మంచు పరదాలు: భారీగా పర్యాటకులు
By admin1 Min Read