ఆధారాలు లేకుండా ఈవీఎంలను నిందించలేమని ఎన్.సీ.పీ (ఎస్.పి) ఎంపీ సుప్రీయా సూలే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల అవకతవకలపై కొందరు ఆరోపణలు చేస్తున్నారని ఇందులో వాస్తవాలను బయటకు తీసుకొచ్చే విధంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బారామతి స్థానం నుండి పోటీ చేసి ఓడిపోయిన తమ పార్టీ నేత యోగేంద్ర పవార్ రీకౌంటింగ్ కోరడం సరికాదని అన్నారు. ఆ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని సూచించగా ఆయన వెనక్కి తీసుకున్నారని చెప్పారు. ఈవీఎంలతో నిర్వహించిన ఎన్నికల్లోనే తాను నాలుగు సార్లు ఎంపీగా గెలిచానని అలాంటప్పుడు అందులో స్కామ్ ఉందని ఎలా చెప్పగలనని అన్నారు. ఈవీఎంలను అయినా బ్యాలెట్ పేపర్ ద్వారా అయిన పారదర్శకంగా జరిగితే ఏ సమస్య ఉండదని అన్నారు. ఇది తన అభిప్రాయమేనని అన్నారు. ప్రజలు ఎలా కోరుకుంటే అలా ఎన్నికలు జరపాలని అన్నారు. ఇక కాంగ్రెస్ సహా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంలపై విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ఆధారాలు లేకుండా ఈవీఎంలను నిందించలేం ఎన్.సీ.పీ నేత సుప్రియా సూలే
By admin1 Min Read